కొబ్బరి సాగులో సెంద్రీయ ఎరువుల వినియోగం..

-

దక్షిణ భారత దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో ఒకటి కొబ్బరి..తెలుగు రాష్ట్రాల తో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కొబ్బరి సాగు అధిక విస్తీర్ణంలో రైతులు చేపడుతున్నారు.కొబ్బరిలో ఎరువులను అందించే విషయంలో రైతులు సరైన పద్దతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రీయమైన ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడి సాధించవచ్చు.

 

ఈ పంట సాగుకు సెంద్రీయ ఎరువుల వినియోగం చాలా మంచిది.భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి, తద్వారా మట్టిలో మొక్కల వేర్లను పోషకాల లభ్యత పెంచుతుంది. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణములను చౌడును తగ్గిస్తుంది. సేంద్రీయపు ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరము వాడుట వలన భూమిలో లభ్యమయ్యే పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు బాగా పెరిగెందుకు సహాయ పడతాయి.

సెంద్రీయ ఎరువులు.. 

పచ్చిరొట్ట ఎరువులు: పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, బొబ్బర్లు (అలసంద) తొలకరి వర్షాలు పడగానే పెంచి, సుమారు 2 నెలలు తరువాత దుక్కిలో బాగుగా కలియ దున్నాలి. ఈ పచ్చిరొట్ట పైరుల వలన భూమిలో నత్రజని, భాస్వరం, మరియు పొటాష్ మొదలగు ముఖ్యపోషకాలు మొక్కలకు అందుతాయి.

చిక్కటి సేంద్రీయపు ఎరువులు: వేపపిండి, గానుగపిండి, వేరుశనగపిండి మొదలగు సేంద్రీయపు ఎరువులలో 3-8% వరకు నత్రజని, 1-2% భాస్వరం, పొటాషియం ఉంటుంది. వీటిని కూడా సేంద్రీయపు ఎరువులుగా చెట్టుకు 2-5 కిలోల చొప్పున వాడుకోవచ్చు..

వీటితో పాటు.. వర్మికంపోస్ట్,కొబ్బరి పొట్టు కంపోస్ట్,స్థూల సేంద్రీయపు ఎరువులు కూడా మంచి సెంద్రీయ ఎరువులు..కొబ్బరిలో పూత రాలే సమస్య నుంచి ఇవి కాపాడుతాయి.తద్వారా దిగుబడి పెరుగుతుంది. అధిక లాభాలను పొందవచ్చు… ఒక్క కొబ్బరి సాగు లోనే కాదు ఇతర పంటలకు కూడా సెంద్రీయ ఎరువులను వాడటం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news