ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడొచ్చా..? అసలేంటి ఉపయోగం..?

ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటీ పేజ్‌లో చాలామంది ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడుతూ వీడియోలు తీస్తున్నారు. అసలేంటిది.. ఫేస్‌ మసాజ్‌ చేసేందుకు వాడుతారని మనం అనుకుంటాం. స్మూత్‌గా ఉంటే రాయితో పట్టుకోవడానికి చిన్న స్టిక్‌లా ఉంటుంది. దీన్ని ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి? మనకు కూడా తెలిస్తే..కొనుక్కోవచ్చుగా..!
క్వార్ట్జ్ రాళ్లను ఇందుకు వాడతారు. ఇవి చాలా సున్నితంగా, తాకితే మృదువుగా ఉంటాయి. ముఖంపై దీంతో రోలింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇలా రక్త ప్రవాహం జరగడం వల్ల మొఖం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ముఖం ఉబ్బడం వంటివి కూడా తగ్గిస్తుందట. రోలర్‌తో ముఖాన్ని మసాజ్ చేసినప్పడు ఇది ముఖంలోని శోషరసాల ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా వాపు లక్షణాలను తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. చర్మానికి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ప్రయోజనాలు కూడా..
చర్మం సాంత్వన కలిగిస్తుంది.
రిలాక్సేషన్ అందిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
రక్త ప్రసరణను పెంచుతుంది.
రెగ్యూలర్‌గా వాడితేనే..
అయితే వీటిని తరచూ వాడడం వల్లే ఈ ఫలితాలు కలుగుతాయి. శాశ్వత ప్రభావం అయితే కలగదు. ముఖాన్ని సన్నగా చేయడం, లావుగా చేయడం వంటివి ఈ రోలర్లు చేయలేవు. కేవలం ముఖాన్ని మెరిపిస్తాయి. కాకపోతే ముఖవాపును తగ్గిస్తాయి. కాబట్టి సన్నగా అయినట్టు అనిపిస్తుంది అంతే కానీ నిజానికి ముఖం అదే సైజులో ఉంటుంది.
ఇలా వాడండి..
రోలర్ ఉపయోగించే ముందు మంచి ఫలితాల కోసం శుభ్రమైన ముఖానికి మాయిశ్చరైజర్ లాంటిది రాసుకుంటే మంచిది. దీనివల్ల రోలర్ చర్మం లోపలికి మాయిశ్చరైజర్ చొచ్చుకుపోయేలా చేస్తుంది. మంచి ఫలితాల కోసం మరీ చర్మంపై గట్టిగా కాకుండా, అలా అని మరీ సున్నితంగా కాకుండా మర్ధనా చేయాలి. సుతిమెత్తగా చేయడం వల్ల ఉపయోగం ఉండదు, గట్టిగా మసాజ్ చేయడం మొటిమలు వంటి గాయాలు పెద్దవవుతాయి… సో.. అదీ ఉపయోగం.. ఇంట్రస్ట్‌ ఉంటే వాడటంలో తప్పుదలేదు.. ఇప్పుడు సెలబ్రెటీలు కూడా ఈ పరికరాన్ని తెగ వాడేస్తున్నారు.