వెయిట్‌ లాస్‌ జర్నీలో హెయిర్‌ లాస్‌ అవుతోందా..?

-

బరువు పెరగేప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు.. హ్యాపీగా నచ్చింది ఎలా పడితే అలా తింటాం. కానీ ఎప్పుడైతే.. బరువు తగ్గాలని నిర్ణయించుకుంటామో.. అప్పుడే అన్నీ కష్టాలు స్టాట్‌ అవుతాయి. నచ్చింది తినకూడదు. బిర్యానీలకు, బర్గర్లకు దూరంగా ఉండాలి. వెయిట్ లాస్.. ప్రపంచంలో చాలా మందికి ఇదొక కల. ఇలా కడుపుమాడ్చుకోని డైట్‌ చేస్తుంటే.. ముఖం పీక్కుపోయి నీరసంగా కనిపిస్తారు. దానికితోడు జుట్టు కూడా రాలిపోతుంది. వెయిట్‌ లాస్‌ కోసం ట్రై చేస్తుంటే.. హెయిర్‌ లాస్‌ అవుతోంది. వెయిట్ లాస్ జర్నీలో జట్టు ఎందుకు ఊడిపోతుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాం.!

అసలు కారణం ఏంటి?

బరువు తగ్గడంలో వ్యాయామాలు చేయడంతో పాటు డైట్ని కూడా ఫాలో అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. వెయిట్ లాస్లో ఈ డైట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాకపోతే, ఇవి జుట్టుకు చేటు చేస్తాయి. సరైన పోషకాలు అందకపోవడంతోనే వెయిట్ లాస్ జర్నీలో జుట్టు ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నట్టుండి అమాంతం బరువు తగ్గిపోయే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ విధంగా జట్టు ఊడిపోవడాన్ని టెలోజెన్ ఎఫ్లువియం (టీఈ) అని అంటారు. ఇది వెయిట్ లాస్, డైట్ వల్ల జరుగుతుంది. వేగంగా బరువు తగ్గిన 3 నెలలకు ఇది మొదలవుతుంది. వాస్తవానికి ఇది తాత్కాలికమే. 6 నెలలోపు ఈ సమస్య పరిష్కారమవుతుంది. అదే 6 నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే ఈ టెలోజెన్ ఎఫ్లువియం క్రానిక్ టీఈగా మారుతుంది. మన జుట్టుకు తగిన మోతాదులో కేలరీలు, పోషకాలు కావాలి. అప్పుడే అవి బాగా, వేగంగా పెరుగుతాయి. వెయిట్ లాస్తో ఇవి లేకపోవడంతో, సైడ్ ఎఫెక్ట్‌గా జట్టు రాలిపోతుంది.

2018లో 180 మంది మహిళలపై జరిగిన ఓ పరిశోధనలో.. జట్టు రాలడానికి స్ట్రెస్తో పాటు ఐరన్ లోపం కూడా ఓ కారణం అని పరిశోధకులు తేల్చారు. కేవలం బరువు తగ్గడాన్నే దృష్టిలో పెట్టుకుని డైట్ను సరిగ్గా ప్లాన్ చేయకపోతే జింక్, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు వంటివి జుట్టుకు అందకపోవచ్చు.

సొల్యూషన్‌ ఏంటి..?

మరి బరువు తగ్గే క్రమంలో జుట్టు కచ్చితంగా రాలుతుందా… దీనికి పరిష్కారం లేదా.. అంటారా..? ఉంది. ఎంత వేగంగా బరువు తగ్గాము అన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా తగ్గాము అనేది ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడంతో పాటు జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. ముందుగా మీరు తీసుకుంటున్న డైట్పై ఫోకస్ చేయండి. జింక్, ఐరన్తో పాటు అన్ని పోషకాలు లభిస్తున్నాయా? లేదా? తెలుసుకోండి. శరీరానికి సరైన పోషకాలు అందడం లేదని అనిపిస్తే, అస్సలు ఆలస్యం చేయకూడదు. వెయిట్ లాస్ను దృష్టిలో పెట్టుకుంటూనే, జట్టు రాలకుండా ఉండే విధంగా డైట్ను ఫాలో అవ్వాలి. సరైన డైట్ను కొన్ని వారాల పాటు పాటిస్తే, జట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news