ఫస్ట్ డేట్ కి వెళ్తున్నారా? ముఖం మీద మొటిమలను ఇలా కప్పేయండి

-

ముఖం మీద కనిపించే మొటిమలు చిరాకు తెప్పిస్తుంటాయి. చిన్నగా మొదలై ఎర్రగా మారి చూడడానికి అందవికారంగా కనిపిస్తుంది. అందుకే మొటిమలను పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఐతే ఈ ప్రయత్నంలో మొటిమలు తగ్గడం ఆలస్యం కావచ్చు. అలాంటప్పుడు మొటిమలను కప్పేసే చిట్కాలు ఉపయోగపడతాయి. అవును, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి, ముఖం మీద మొటిమ ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు, మొటిమలు కనబడకుండా కప్పేయడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

లైట్ మాయిశ్చరైజర్

లైట్ కలర్ లో ఉండే మాయిశ్చరైజర్ ని మొటిమల మీద అప్లై చేస్తే మొటిమలు ప్రకాశవంతంగా కనిపించవు. చర్మం రంగులో మారి పెద్దగా కనిపించదు.

ఐస్ క్యూబ్

మొటిమలు ఎర్రగా మారి ఎక్కువ మందికి కనిపించకుండా ఉండటానికి ఐస్ క్యూబ్ పనిచేస్తుంది. మొటిమల మీద ఐస్ క్యూబ్ తో మర్దన చేస్తే దానిలోని ఎరుపుదనం తగ్గుతుంది. దానివల్ల మొటిమ పెద్దగా కనిపించదు.

కాన్సీలర్

మార్కెట్లో దొరికే చర్మ సాధనమైన కాన్సీలర్ ఉపయోగిస్తే మొటిమలు ఏర్పడకుండా ఉంటాయి.

కలర్ కరెక్షన్

పసుపు లేదా ఆకుపచ్చ రంగు ఉన్న కలర్ కరెక్షన్ తీసుకోవడం మొటిమల మీద మర్దన చేయాలి. ఆ తర్వాత కాన్సీలర్ తో టచప్ చేస్తే మ్యాజిక్ చేసినట్టుగా అనిపిస్తుంది.

పౌడర్

పైన చెప్పినవన్నీ మీకు అందుబాటులో లేనందున కేవలం పౌడర్ తీసుకునే ముఖం మీద బాగా అప్లై చేయండి. అంతే, మొటిమలు కనిపించమన్నా కనిపించవు.

Read more RELATED
Recommended to you

Latest news