పుదీనా ఆకులతో ఇలా ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం

-

పుదీనా మన వంటలలో ఉపయోగించే రుచికరమైన మరియు ఔషధ ఆకు. కొత్తిమీర, పుదీనా లేకుండా ఏ మసాల వంట పూర్తవ్వదు కదూ.! పుదీనా వంటల్లోనే కాదు.. చర్మ సంరక్షణకు అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంది. అలాగే ఈ ఆకు సహజ యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు చర్మాన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, మొటిమలు లేకుండా, మచ్చలు లేకుండా చేస్తాయి. కూలింగ్ గుణాల వల్ల మీరు దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ముఖానికి పుదీనా ఆకులను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ మరియు పుదీనా ఆకులు:  అరకప్పు దోసకాయ ముక్కలను పావు కప్పు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కలిపి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముల్తానీ మిట్టి మరియు పుదీనా ఆకు:  కొన్ని పుదీనా ఆకులను బాగా గ్రైండ్ చేసి, ఒక పెద్ద చెంచా ముల్తానీ మిట్టి మరియు కొంచెం రోజ్ వాటర్ కలిపి ఆ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
రోజ్ వాటర్ మరియు పుదీనా ఆకులు: పుదీనా ఆకులను, కొద్దిగా రోజ్ వాటర్‌ను గ్రైండ్ చేసి మొటిమలు, మచ్చలపై రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
పుదీనా ఆకుతో ఎలాంటి ఫేస్‌ప్యాక్‌ను ప్రయత్నించినా అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మంపై ఎప్పుడైనా దురద, ఇరిటెషన్‌ అనిపిస్తే కేవలం పుదీనా పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని కొద్ది సేపటికి క్లీన్‌ చేయండి.. ఆ ఇరిటేషన్‌ తగ్గుతుంది. ఇంట్లో తయారు చేసుకునే బ్యూటీ టిప్స్‌లో కూడా పుదీనా పేస్ట్‌ను మిక్స్‌ చేసుకోవచ్చు. చర్మానికి సున్నతిత్వం, మచ్చలు, మొటిమలు, ఏం ఉన్నా పుదీనా ఆకు అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే కేవలం ఒక్కసారి చేస్తే మాత్రం మీరు ఎలాంటి ఫలితం గమనించరు. తరచూ చేస్తుండాలి.!

Read more RELATED
Recommended to you

Latest news