మిలమిల మెరిసే చర్మం కోసం తేనె ఫేస్ మాస్క్ ప్రయత్నించారా?

-

మెరిసే చర్మం కావాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు కూడా. మార్కెట్లో ఉన్న చర్మ సాధనాలు ప్రయత్నించినా ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి వారు పెద్దగా దిగులు పడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉన్న వస్తువులతో తయారయ్యే ఫేస్ మాస్క్ (Face mask) ఉపయోగిస్తే చాలు, మీ చర్మం మిలిమిల మెరిసిపోతుంది. దానికోసం తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో కొద్దిగా నిమ్మరసం కలిపితే దాని ప్రభావం మరింత పెరుగుతుంది.

ప్రస్తుతం చర్మం మిలమిల మెరవడానికి తేనె, నిమ్మ కలిపి ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

నిమ్మకాయ, తేనె.. రెండింట్లో చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఒక వరంగా అనుకోవచ్చు. టర్కీకి చెందిన మహిళలు ఈ తేనె, నిమ్మకాయ కాంబినేషన్ ని ఎక్కువగా వాడతారు. దీన్ని వారు ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ రెండు పదార్థాలతో ఫేస్ మాస్క్ తయారు చేసి క్రమం తప్పకుండా వాడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు రెండే, తేనె, నిమ్మకాయ.

1టేబుల్ స్పూన్ తేనె
సగం నిమ్మకాయ ముక్క

ఈ రెండింటినీ బాగా కలిపి ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో భద్రపర్చుకోండి. ఆ తర్వాత ఆ డబ్బాని ఒక రోజంతా రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.

ఎలా వాడాలి?

చల్లని మిశ్రమాన్ని ముఖంపై మాస్కులాగా తొడగాలి. 15నిమిషాల పాటు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ మాస్కుని క్రమం తప్పకుండా ముఖానికి పెట్టుకుంటే కొద్ది రోజుల్లో మీ ముఖంలో మార్పు గమనించవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news