ముఖ సౌందర్యం అనేది చర్మ సంరక్షణలో ఒక భాగమే అయినా ముఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజం చెప్పాలంటే చర్మ సంరక్షణలో ముఖానికె ప్రథమ స్థానం. ఎందుకంటే చాలా చర్మ సమస్యలు ముఖ భాగంలోనే వస్తాయి. అలాగే కనిపిస్తాయి కూడా. అందుకే ముఖాన్ని అందంగా, సురక్షితంగా ఉంచుకుంటే మంచిది. ముఖాన్ని అందంగా ఉంచకుండా చేసే విషయాల్లో ప్రధానమైనవి నల్లమచ్చలు. ఇవి చెంపలపై, ముక్కు మీద ఏర్పడి మెరిసే గుణాన్ని తగ్గిస్తాయి.
అందుకే వీటిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది. కొన్ని సార్లు ఇవి అంత త్వరగా తగ్గవు. చాలా మొండిగా ఉంటాయి. అలాంటి టైమ్ లో ఏం చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
కొన్ని మంచినీళ్ళు
తాజా పళ్ళు తోమే బ్రష్
చిన్న గిన్నె
టూత్ పేస్ట్
తయారీ విధానం
చిన్నగిన్నెలోకి కొంతపాటి వైట్ టూత్ పేస్ట్ ని తీసుకోవాలి. అందులో బేకింగ్ పౌడర్, మంచినీళ్ళు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ముక్కు, చెంపలు, దవడ వంటి నల్లమచ్చలున్న ప్రదేశాల్లో బ్రష్ తో రాయండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇలా చేసినా మీకు ఫలితం కనిపించకపోతే టవల్ తీసుకుని వేడినీళ్ళలో ముంచి నల్లమచ్చలున్న చోట బాగా మర్దన చేయండి. ఆ తర్వాత ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఎందుకంటే మన శరీరంలో చర్మం అనేది అన్నింటికన్నా పెద్ద అవయవం. అందుకే ఎక్కువ సమస్యలు దానికే వస్తాయి.