బిజినెస్ ఐడియా: బంగాళాదుంప చిప్స్ తో భలే లాభాలు..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి చూస్తున్నారు. వ్యాపారాన్ని సొంతంగా మొదలుపెట్టి మంచిగా లాభాలని పొందాలని అనుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసి భలేగా లాభాలని పొందాలంటే ఈ ఐడియాని అనుసరించొచ్చు. అదే బంగాళదుంప చిప్స్ బిజినెస్. చాలా మంది బంగాళదుంపల్ని ఇష్టపడతారు బంగాళదుంపలతో చేసిన ఏ వంటకాలనైనా సరే తినేస్తుంటారు.

దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద కూడా తల్లిదండ్రులు బంగాళదుంప చిప్స్ ని ఇస్తూ వుంటారు. కాలక్షేపానికి తినడానికి కూడా ఇవి బాగుంటాయి. ఇక మరి ఈ బిజినెస్ ని ఎలా చేయాలి…? ఎలా లాభాలని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఈ వ్యాపారం కోసం మీరు కేవలం 850 రూపాయలకి మిషన్ ని కొనుగోలు చేయొచ్చు మీకు లాభాలు ఎక్కువ అయ్యే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్ళచ్చు. అప్పుడు లాభాలు అధికంగా వస్తాయి.

ఈ వ్యాపారం చేయాలనుకుంటే మిషన్ తో పాటుగా ముడి పదార్థాలపై కొంచెం ఖర్చు చేయాలి మొదట మీరు ముడి పదార్థల కోసం 100 నుండి 200 వరకు మాత్రమే ఖర్చు చేయండి. వ్యాపారం పెరిగే కొద్దీ క్రమంగా మీరు పెట్టుబడిని కూడా ఎక్కువ పెట్టొచ్చు. పైగా ఈ మిషన్ పనిచేయడానికి కరెంట్ అక్కర్లేదు. వ్యాపారం బాగా సాగాలంటే మంచి నాణ్యతని మెయింటెన్ చేయండి.

పెద్ద పెద్ద షాపులు దీనికి అక్కర్లేదు. మీరు ఒక చిన్న స్టాల్ ని కానీ చిన్న బండిని కానీ పెట్టొచ్చు. బంగాళదుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే ఏడు రెట్లు ఎక్కువ ఉంటుంది రోజుకి 10 కిలోల బంగాళదుంపలు చిప్స్ ని కనుక మీరు అమ్మితే వెయ్యి రూపాయలు సంపాదించొచ్చు మీరు మీ స్టాల్ ని అడ్వర్టైస్ చేయాలంటే సోషల్ మీడియాని ఉపయోగించుకోవచ్చు అప్పుడు అందరికీ తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news