బిజినెస్ ఐడియా: నాప్కిన్ పేపర్ బిజినెస్ తో లాభాలు లక్షల్లో..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మంచిగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా మంచి బిజినెస్ మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. దీనిని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే నాప్కిన్ పేపర్ తయారీ బిజినెస్.

 

నాప్కిన్ పేపర్ తయారు చేయడం వల్ల మంచిగా డబ్బులు వస్తాయి. దీనికోసం మీరు ఇంట్లోనే చిన్న ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా నాప్కిన్ పేపర్ ని తయారు చేయొచ్చు. సంవత్సరానికి 1.5 లక్షల కేజీల నాప్కిన్ పేపర్ ని తయారు చేయొచ్చు. మార్కెట్లో కేజీ నాప్కిన్ పేపర్ 65 రూపాయలు పలుకుతోంది. అంటే మీరు ఏడాదికి కోట్ల టర్నోవర్ చేయొచ్చు. మొదటి సంవత్సరం లోనే పది లక్షల నుండి 12 లక్షలు సంపాదించడానికి అవుతుంది.

ఈ బిజినెస్ ని మొదలు పెట్టడానికి రా మెటీరియల్, మెషిన్ వంటివి అవసరం అవుతాయి. ఎలా చూసుకున్నా ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ మిషన్ ధర ఐదు లక్షలు నుంచి మొదలవుతుంది. సెమీ ఆటోమేటిక్ మిషన్ కావాలి అనుకుంటే 5 నుండి 6 లక్షలు ఖర్చు చేయాలి.

అదే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అయితే 10 నుండి 11 లక్షలు అవుతుంది. ప్రభుత్వం ముద్ర లోన్ ఇస్తోంది. ముద్ర యోజన కింద లోన్ తీసుకుంటే టర్మ్ లోన్ గా మూడు లక్షల రూపాయలు వస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ లోన్ గా ఐదు లక్షలు వస్తాయి ఇలా మీరు వ్యాపారం కోసం పన్నెండు లక్షల రూపాయలని ముద్ర లోన్ ద్వారా పొందొచ్చు యూరోపియన్ దేశాలతో పాటు మీరు ఇండియాలో కూడా వీటిని చేయొచ్చు ఇలా ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news