బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్‌కు పెట్టుబడి రూ. 5వేలున్నా చాలు.. మొదలుపెట్టొచ్చు..!

-

వ్యాపారం చేయాలంటే…లక్షల్లో పెట్టుబడి, విశాలమైన ప్లేస్‌ ఉండక్కర్లేదు. మన దగ్గర మంచి ఐడియా ఉండాలే కానీ.. ఇంట్లో ఉండే వ్యాపారం చేయొచ్చు. పెట్టుబడి కూడా తక్కువే. అలాంటి చిరువ్యాపారాల్లో ఒకటి స్నాక్స్‌ బిజినెస్‌.. స్నాక్స్‌ బిజినెస్‌ అని లైట్‌ తీసుకోకండి. స్నాక్స్ తయారు చేసి లక్షల్లో సంపాధించవచ్చు. ఎంత క్వాలిటీ, రుచి మెయింటేన్ చేస్తే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఈ బిజినెస్‌ను తక్కువ పెట్టుబడి, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ స్థలంలోనూ ప్రారంభించవచ్చు. మరీ ఈ బిజినెస్‌లో లాభనష్టాల మాటేంటో చూద్దామా..!

ఇలా ప్రారంభించండి

మీ ఇంట్లో వారికి ఎవరికైనా పిండి వంటలు తయారు చేయడం వచ్చి.. మీకు సహకరించడానికి ఆసక్తి ఉంటే ఈ వ్యాపారాన్ని ఈజీగా మొదలుపెట్టొచ్చు. మీకు ఎవ్వరికీ రావంటే.. మంచి పిండి వంటలు చేయగలిగిన నిపుణులను నియమించుకోండి. వారికి జీతం ఇవ్వాలి లేదా వాటా ఇచ్చేలా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొంచెం పెద్దగా ఈ బిజినెస్‌ను ప్రారంభించాలనుకుంటే మాత్రం వివిధ రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి.

ఇంకా ఈ వ్యాపారం ప్రాంభించడానికి ముందు అన్ని రకాల పిండి, నూనె, శనగపిండి, ఉప్పు, నూనె, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు మీకు అవసరం అవుతాయి. వీటి నాణ్యతలో అసలు రాజీపడకండి. ఏ వంటకైనా ఆ పిండి క్వాలిటీ చాలా ముఖ్యం. అది బాలేదంటే..మీరు ఎంత రుచిగా చేసినా అవి ఏడ్చినట్లే వస్తాయి. వంట మిషనరీతో పాటు ప్యాకేజింగ్, వెయింగ్ మెషిన్ మొదలైన కొన్ని యంత్రాలు అవసరం. దీనితో పాటు, మీకు 1-2 మంది ఉద్యోగులు కూడా అవసరం.

ఖర్చులు-సంపాదన

ఈ వ్యాపారాన్ని ఐదు వేలతో కూడా ప్రారంభించవచ్చు. డబ్బు ఎక్కువ ఉంటే..ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం 2 నుంచి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ వ్యాపారం సక్సెస్ అయితే.. మీకు 20 నుండి 30 శాతం వరకు లాభాలు వస్తాయని నివేదికలు చెప్తున్నాయి. కాకపోతే కష్టపడాల్సి ఉంటుంది. బిజినెస్‌ గ్రో అయ్యే కొద్ది..మీకు లాభాలు పెరుగుతాయి..పనివాళ్లు పెరుగుతారు..అప్పుడు మీరు మానేజింగ్‌ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news