బిజినెస్ ఐడియా: ఈ పంటతో రైతులకు మంచి ఆదాయం..ఏడాది పొడవునా డబ్బే డబ్బు..!

-

ఈ మధ్య ప్రతి ఒక్కరూ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు..టవున్ లో ఉద్యోగాలను వదిలి పెట్టి,పల్లెల్లో వ్యవసాయం చేస్తున్నారు.సంప్రదాయ పంటలను కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. సొంతూరిలో తల్లిదండ్రుల వద్దే ఉంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి అద్భుతమైన పంటల్లో వాటిలో ఒకటి మునగ సాగు..గ్రామాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు మునగ కాయలకు మంచి డిమాండ్ ఉంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది మునగకాయలను రోజూ వారీ కూరల్లో వినియోగిస్తారు. సాంబార్ వేస్తారు. లేదంటే కర్రీ చేస్తారు.

ఆయుర్వేదంలోనూ మునగ ఆకులు వినియోగిస్తున్నారు. మునగ కాయలతో పాటు మునగ ఆకులతో కూడా చాలా మంది కూరలు చేసుకుంటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి ధర లభిస్తోంది..మునగ ఎటువంటి నేలలో అయిన పండుతుంది.పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఈ పంటతో నెలకు రూ.50వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన సంవత్సరానికి రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చు. మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు.

ఇది తక్కువ ఖర్చుతో కూడిన పంట.. ఒకసారి వేస్తే నాలుగు ఏళ్ళ వరకూ మళ్ళీ ఎటువంటి పంట వేయాల్సిన అవసరం లేదు..సంవత్సరానికి రెండుసార్లు కాపు తీయవచ్చు. ఏడాది పొడవునా ఒక్కో మొక్క నుంచి దాదాపు 200-400 కాయలు (40-50 కిలోలు) అందుబాటులో ఉంటాయి. మునగకాయలను తక్కువ సంఖ్యలో అమ్మితే ఎక్కువ రోజుల పాటు చెట్టుపై ఉంచే.. మెల్లమెల్లగా కోయాల్సి ఉంటుంది. లేదు గిరాకీ ఎక్కువగా ఉంటే.. ఎక్కువ సంఖ్యలో కోత కోయవచ్చు.

అయితే మునగకాయ బాగా ముదరకుండా జాగ్రత్త పడ్డాలి. కాస్త లేతగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తీసుకెళ్లాలి. అలాంటి వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. లాభాలు కూడా అధికంగా వస్తాయి..ఎకరంలో 1,200 మొక్కలు నాటుకోవచ్చు. ఇందుకు దాదాపు రూ.50,000-60,000 ఖర్చు అవుతుంది. ఒక్కసారి మొక్కలు నాటమంటే చాలు.. అవే పెరుగుతాయి. అది కూడా తక్కువ సమయంలో ఏపుగా ఎదుగుతాయి..ఏడాదికి అన్ని ఖర్చులు పోగా 60000 వరకూ ఆదాయం ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news