బిజినెస్ ఐడియా: ఆ యాప్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసేవాల్లు ఎక్కువ అవుతూన్నారు..టెక్నాలజీని ఉపయోగించి కూడా బిజినెస్ చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా కొందరు డబ్బులను సంపాదిస్తున్నారు..ఇప్పటికే చాలా మంది ఇప్పటికే యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది డబ్బు సంపాదిస్తున్నారు..కాగా ఇప్పుడు మరో యాప్ ద్వారా కూడా సులువుగా డబ్బులు సంపాదించవచ్చు..

ఇన్స్టాద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.ఇప్పుడు ప్రతీఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను చూసే వారి సంఖ్య భారీగానే ఉందని మీ అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రజలు చాలా వినోదాన్ని పొందుతున్నారు. భారతదేశంలో టిక్ టాక్ నిషేధించబడింది, దీంతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా ప్రజాదరణ పొందింది. రీళ్ల ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారంటే నమ్మకం కుదరడం లేదా. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు.. అలాగే సినీ తారలు హీరోయిన్ సమంత కూడా ఇలా డబ్బులను సంపాదిస్తున్నారు…ఒక్కో పోస్టుకు దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు..

సామాన్యుల సంపాదన కూడా లక్షలకు పైమాటే ఉంది. ఇంత డబ్బు సంపాదించడం ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చో మేము మీకు తెలియజేస్తాము. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే నెలకు ఇరవై వేల వరకు సంపాదించవచ్చు..మీకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండాలి. ఎంత ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. ఉదాహరణకు మీకు 5 లక్షల మంది ఫాలోయర్లు ఉంటే నెలకు 1 లక్ష కంటే ఎక్కువ సంపాదించవచ్చు. మీకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే, ప్రకటనలు ఇవ్వడానికి మరిన్ని కంపెనీలు మీ వద్దకు వస్తాయి..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డబ్బులను ఎలా సంపాదించవచ్చునో ఇప్పుడు చుద్దాము..

మీరు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్, రీల్‌తో ద్వారా ఒక బ్రాండ్ లేదా ఉత్పత్తిని ప్రమోట్ చేసినప్పుడు, వారు మీకు ప్రతిఫలంగా డబ్బు చెల్లిస్తారు. దీన్ని స్పాన్సర్డ్ పోస్ట్ అంటారు. మీకు ఫ్యాషన్ సంబంధిత కంటెంట్‌ను పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంటే మరియు 1 లక్ష మంది ఫాలోవర్లు ఉన్నట్లయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ లేదా ఇతర కంపెనీల బ్రాండ్‌లను ప్రచారం చేయడం ద్వారా రూ. 25,000 వేల వరకు సంపాదించవచ్చు..

ఇందులో ఏదైనా ఆన్ లైన్ మార్కెట్ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. Amazon, Flipkart, eBay, Myntra మొదలైన కంపెనీలు ఉత్పత్తిని ప్రమోట్ చేయాలి, మీరు పెట్టిన లింక్ ద్వారా వినియోగదారు వస్తువును కొనుగోలు చేస్తే, మీకు డబ్బు వస్తుంది..

మీరు ఏదైనా చిరు వ్యాపారాన్ని చేస్తున్నట్లు అయితే,ఆ వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని Instagramలో పోస్ట్ చేసి వాటిని విక్రయించవచ్చు..మీ ప్రోడక్ట్ నచ్చితే కొనుకుంటారు..

ఇంకో కొత్త వ్యాపారం కూడా ఒకటి ఉంది.ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అమ్మకం..కొంత మంది వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి, మంచి సంఖ్యలో అనుచరులను పొందిన తర్వాత దానిని విక్రయిస్తారు.ఇలా కూడా డబ్బులను సంపాదిస్తారు..ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా డబ్బులను సంపాదించే వారు చాలా మందే ఉన్నారు.మీకు ఈ బిజినెస్ నచ్చితే ట్రై చెయ్యండి.