చిరంజీవి సామాజిక సేవా తత్పరతకు నిదర్శనం.. బ్లడ్, ఐ బ్యాంకులు..!

-

దానాలన్నింటిలోనూ రక్తదానం, నేత్రదానం చాలా ముఖ్యమైనవి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసే జీవధార.. రక్తం. ఇక నేత్రదానం వల్ల మరొకరి జీవితంలో వెలుగు నిండుతుంది.

మనం ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా సరే.. సమాజంలో ఉన్న తోటి వారికి సహాయం చేయాలి. మనుషులమైన మనం సాటి మనుషులను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి ఉండాలి.. తోటి వారికి సహాయ పడడంలోనే నిజమైన ఆత్మ సంతృప్తి ఉంటుంది.. అవును, సరిగ్గా ఇవే మాటలను నమ్మారు కనుకనే చిరంజీవి సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌ల పేరిట ఎన్నో వేల మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు.

chiranjeevi | చిరంజీవి

దానాలన్నింటిలోనూ రక్తదానం, నేత్రదానం చాలా ముఖ్యమైనవి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసే జీవధార.. రక్తం. ఇక నేత్రదానం వల్ల మరొకరి జీవితంలో వెలుగు నిండుతుంది. కనుకనే చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రదాన, రక్తదాన సేవలను ఎప్పటి నుంచో అందిస్తున్నారు. అక్టోబర్ 2, 1998న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దాంతో ఆయా సేవలను అందిస్తూ వస్తున్నారు.

 

chiranjeevi-blood-banks

కాగా రక్తదానం వల్ల ఇప్పటికి సుమారుగా 1.50 లక్షల మంది సేవలు పొందగా, నేత్రదానం వల్ల ఎన్నో వేల మంది మళ్లీ కంటి చూపును పొందారని అంచనా. ఎన్నో లక్షల మంది ఇప్పటికే తమ మరణానంతరం నేత్రదానం చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా చిరంజీవి జన్మదినం రోజున ఆయన అభిమానులు తెలుగు రాష్ర్టాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా అప్పట్లో చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకులు అత్యుత్తమ సేవా సంస్థలుగా ప్రభుత్వ గుర్తింపును కూడా పొందాయి. ఏది ఏమైనా చిరంజీవి నటుడిగానే కాదు, సామాజిక సేవకుడిగా కూడా ప్రజల మెప్పు పొందారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news