ల’వ్‌’వణ్య పుట్టిన రోజు కొన్ని ఆసక్తి విషయాలు..!

‘సోగ్గాడే.. చిన్ని నాయనా’ అంటు అందగాడు నాగార్జున కలిసి స్టెప్పులేసిన లావణ్యత్రిపాఠి ఈ రోజుతో 30 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆ ‘అందాల’ రాక్షసి గురించి కొన్ని విషయాలు..?

లావణ్య ఉత్తరఖండ్‌ లోని అయోధ్యలో 1990లో జన్మించింది. అక్కడే తన తండ్రి న్యాయవా«ధి కావడంతో బాల్యమంతా అక్కడే గడిపింది. ఆ తర్వాత ఉన్నత చదువు కోసం దేశ రాజధానికి వెళ్లి రిషి దయారమ్‌ నేషనల్‌ కాలేజిలో ఎకనామిక్స్‌లో గాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. మోడలింగ్‌పై కాస్త ఆసక్తి కనబరచి చిన్నచిన్న ప్రకటనల్లో నడిస్తూ 2006లో తన అందంతో మిస్‌ ఉత్తరఖండ్‌గా నిలించింది.

తదనంతరం తెలుగు రంగంవైపు అడుగులు వేస్తూ 2012లో అందాల రాక్షసితో తన ఖాత తెరిచింది.
నాచురల్‌ స్టార్‌ నానీతో భలేభలే మగాడివోయ్‌లో తనదైన శైలిలో నటించి మన్ననాలు పొందింది. గతేడాది లావణ్య నట్టించిన అర్జున్‌ సురవరం బాక్సఫీస్‌ బద్దలు కొట్టింది.విజయ్‌ దేవరకొండతో గీతాగోవిందంతో అవకాశం వచ్చినా కొన్ని కారణాలు చేయలేకపోయానని ఓ సారి తెలిపింది. తాను ఎంచుకున్న పాత్ర మంచి అనుభూతి, కొత్తదనం ఉండేలా చూసుకుంటానంటది. శ్రీదేవి, మాధురి దీక్షీత్‌లే తనకు రోల్‌మాడల్, వారి స్పూర్తే తాను ఈ రోజు కథనాయిక కావడానికి కారణమంటా.

ప్రస్తుతం’8ఏ1’లో సందీప్‌ కిషన్‌తో నటిస్తోంది. అందులో హాకీ క్రీడాకారిణి పాత్ర ఉండటంతో ప్రసుత్తం ఆ క్రీడపై కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో బీజీగా ఉంది. ‘నీ ధైర్యాన్ని నువ్వ నమ్ముకో’ కళను కేవలం కళగానే చూడాలి ఏమాత్రం పోటీలా చూడకూడదని లవ్‌ చెబుతోంది.