గమ్మునుండవాయ్.. ఫ్యాన్స్ కు బన్ని ట్వీట్..!

Allu Arjun Tweet for Fans

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత తన నెక్స్ట్ మూవీ ఏంటన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ కన్ఫాం అని తెలుస్తున్నా అఫిషియల్ గా చెప్పలేదు. ఇక లేటెస్ట్ గా బన్ని తర్వాత సినిమా మీద డిస్కషన్స్ మొదలయ్యే సరికి ఏకంగా బన్నినే స్పందించడం జరిగింది. తన తర్వాత సినిమాపై ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని. ఓ మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అవుతుంది అంతవరకు ఓపిక పట్టండని బన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు తనని ఇంతగా అభిమానిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

విక్రం కుమార్ సినిమా ఫైనల్ అనుకోగా చూచాయగా కూడా ఆ మాట ప్రస్థావించలేదు కాబట్టి కచ్చితంగా బన్ని అతని ప్రాజెక్ట్ మీద అంచనాలు కలిగిలేడని తెలుస్తుంది. ఇక మరో పక్క లేటెస్ట్ గా బన్ని మరోసారి పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. వారి కాంబినేషన్ లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు వచ్చాయ్. మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

అయితే అసలు ఏమాత్రం ఫాంలో లేని పూరితో బన్ని సాహసం చేయగలడా అన్నది కూడా చర్చల్లోకి వస్తుంది. నా పేరు సూర్య కోసం వంశీని నమ్మి మోసపోయిన బన్ని మరోసారి అలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేదని చెప్పొచ్చు.