వాయిదాప‌డ్డ గోపీచంద్ మూవీ షూటింగ్‌.. నిరాశ‌లో మారుతి

ఈ క‌రోనాను చూస్తుంటే టాలీవుడ్‌ను అత‌లాకుత‌లం చేసేదాకా వ‌దిలేలా లేదు. దీని దెబ్బ‌కు ఇప్ప‌టికే చాలా సినిమాలు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు షూటింగులు నిలిపివేశాయి. మ‌రికొన్ని రిలీజ్ డేట్ ను వాయిదా వేశాయి. నిన్న‌గాక మొన్న ర‌వితేజ సినిమా, మ‌హేశ్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాలే ఆగిపోయాయి. ఇక తాజాగా మ‌రికొన్ని సినిమాలు ఇదే జాబితాలో చేరాయి.

ఇంతకుముందు సర్కార్ వారి పాట, ఆచార్య షూటింగ్ స్పాట్ లో పలువురికి కరోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో ఆ సినిమా షూటింగులు నిలిపివేశారు.ఇక తాజాగా నాగ‌చైత‌న్య థాంక్యూ సినిమాను కూడా ఆపేశారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి గోపిచంద్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేషన్ తెర‌కెక్కుతున్న మూవీ షూటింగ్ ని కూడా వాయిదా వేశారు.
డైరెక్ట‌ర్ మారుతి రెండేళ్లుగా సినిమా చేయ‌కుండా ఖాళీగా ఉన్నారు. ఎట్ట‌కేల‌కు గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేస్తే క‌రోనా అడ్డం వ‌స్తోంది. దీంతో మారుతి ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. అయితే కొవిడ్ ప్ర‌భావం త‌గ్గేదాకా వెయిట్ చేయాలని మారుతి టీం భావిస్తోంది. థియేట‌ర్ల కొర‌త‌తో వేగంగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాల‌నుకుంటే ఇప్పుడు క‌రోనా అడ్డుక‌ట్ట వేస్తోంది. ఇదే కాదండోయ్ హీరో గోపీచంద్ మ‌రో సినిమా సీటీమార్ కూడా రిలీజ్ డేట్ ఛేంజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇది గోపీచంద్ అభిమానుల‌కు పెద్ద నిరాశే అని చెప్పాలి. ఈ క‌రోనా ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేద‌ని స‌మాచారం. అన్ని సినిమాల ప‌రిస్థితి ఇలాగే త‌యారైతే టాలీవుడ్ సంక్షోభంలో కూరుకుపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైనా నిబంధ‌న‌లు మేర‌కు షూటింగులు చేస్తే మంచిద‌ని నిపుణులు తెలుపుతున్నారు.