యూట్యూబ్ లో దూసుకుపోతున్న బాలకృష్ణ ‘రూలర్’ టీజర్….!!

-

యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘రూలర్’ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఆయన నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. దానితో కెరీర్ పరంగా కొంత ఆలోచనలో పడ్డ బాలకృష్ణ, ఎలాగైనా ఈసారి మంచి హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని భావించి, గత ఏడాది తనకు జైసింహా తో మంచి సక్సెస్ ని అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు.

కొన్నాళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా, ఇటీవల ఈ సినిమాకు రూలర్ గా టైటిల్ నిర్ణయించి ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఆ పోస్టర్లలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక టీజర్ ని బట్టి చూస్తుంటే, ఈ సినిమా మంచి మాస్, కమర్షియల్ యాక్షన్ మూవీ అని అర్ధం అవుతుంది. ‘ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటెనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను …. ఒక్క సారి యూనిఫామ్ తీసేస్తే, బయటికి వచ్చిన సింహంలా ఆగను…… ఇక వేటే’ అని బాలకృష్ణ పలికే డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉంది.

టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ మరియు ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతూ దూసుకుపోవడంతో పాటు, మొత్తంగా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. సికె ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రప్రంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news