ఒకే ఫార్ములాతో సక్సెస్ అయిన టాలీవుడ్ 3 చిత్రాలివే..!!

-

సినిమాలలో సక్సెస్ రేట్ ఒక్కో కాలంలో ఒక్కో విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నటించిన మూడు సినిమాల్లో కూడా పాప అనే ఒక కాన్సెప్ట్ తో ఒకే ఫార్ములాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. కేవలం ఒక చిన్న పాపని కాన్సెప్ట్ గా తీసుకొని ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురి నందమూరి హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించడం జరిగింది. ఆ మధ్యకాలంలో దైవత్వాన్ని ఆసరాగా చేసుకున్న సినిమాలకు ప్రేక్షక ఆదరణ బాగా దక్కుతోందని చెప్పవచ్చు.. ఇక ఆ కాలం అలా అయితే ప్రస్తుతం ఇటీవల కాలంలో కూడా దైవత్వం అనేది హిట్ ఫార్ములాగా కనబడుతోంది.

ఇక ఇటీవల కాలంలో దైవత్వం కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ మూడు సినిమాల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి ఆ 3 సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమా శివ తత్వంతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య వచ్చిన కార్తికేయ 2 కూడా కృష్ణుడి తత్వాన్ని బలంగా చూపించి.. మరింత విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే శ్రీకృష్ణుడి తత్వాన్ని బలంగా చూపించి భగవద్గీతలోని ఆయన సారాన్ని ఫాంటసీ డ్రామాగా జోడించిన వైనం ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కృష్ణుడిని పూజించే, ఇష్టపడే నార్త్ ఆడియన్స్ కి ఇలా బిగ్ స్క్రీన్ మీద గ్రాఫిక్స్ సహాయంతో క్వాలిటీ కంటెంట్ ప్రజెంట్ చేయడంతో సినిమాను ఓన్ చేసేసుకున్నారు నార్త్ ఇండియన్స్.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సైతం క్లైమాక్స్ లో రామ్ చరణ్ రాముడి గెటప్ లో చూసి ఆడియన్స్ ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇక ఇలా మన సినిమా నార్త్ ఇండియన్స్ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా నార్త్ లో కూడా తెలుగు సినిమాలో సక్సెస్ అవ్వడానికి ఈ దైవత్వమే ప్రధాన కారణం అయ్యింది.

అంతకుముందు అఘోరాగా బాలకృష్ణ చెప్పిన శివతత్వాన్ని సబ్ టైటిల్స్ తో చూసి నార్త్ ఆడియన్స్ ఓటిటిలో కూడా అఖండకు అద్భుతమైన ఆదరణ కట్టబెట్టారు. మూడు సినిమాల విజయాలను చూసినట్లయితే కచ్చితంగా దైవత్వం ఫార్ములా తోనే ఈ మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయని స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version