Romantic : ఓటీటీ సంద‌డి చేయ‌నున్న ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

-

Romantic: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. పూరి జ‌గ‌న్నాథ్ నిర్మాణ భాద్యతలు చూసుకున్నారు.
ఆకాష్ రొమాంటిక్ సినిమాకు స‌పోర్టుగా.. రెబల్ స్టార్ ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు నిలిచారు.


ఇటీవ‌లే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో ఆకాశ్ పూరి తన మార్క్ కు చూపించాడు. త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేశాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 26న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది ఆహా. ఈ మేరకు అధికార ప్రకటన కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news