‘ఏజెంట్’పైనే అక్కినేని అభిమానుల ఆశలు..కొత్త జోనర్ ట్రై చేస్తున్న అఖిల్

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్..సినీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ కోసం ఎదరు చూస్తున్నాడు. ఈ యంగ్ హీరో ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ ఫిల్మ్ అయితే నమోదు కాలేదు. కాగా, ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సక్సెస్ అయింది. కానీ, అభిమానులు సంబురపడేంత స్థాయిలో అయితే కాదని చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ ఫిల్మ్ పైన అక్కినేని వారి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో సరి కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు యంగ్ హీరో అఖిల్.

స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ పిక్చర్ ను ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్టోరి అందించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. మాలీవుడ్ (మలయాళం) మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించగా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ పార్ట్ నర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల కానున్న ఈ పిక్చర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news