బాలుడికి బాలీవుడ్ స్టార్ హీరో పాదాభివందనం..ఎందుకో తెలుసా?

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్..ఇటవల బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల పాటు లవర్స్ గా ఉన్న ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ సంగతులు పక్కనబెడితే..రణ్ బీర్ కపూర్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో రణ్ బీర్ కపూర్ ఓ బాలుడికి పాదాభివందనం చేస్తుండటం చూడొచ్చు..వివరాల్లోకెళితే..ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన క్రమంలో రణ్ బీర్ కపూర్ మీద ఉన్న అభిమానంతో ఓ బాలుడు స్టేజీ మీదకు వచ్చి రణ్ బీర్ కపూర్ కాళ్ల మొక్కాడు. కాగా, అలా చేస్తు్న్న క్రమంలోనే అడ్డుకున్న రణ్ బీర్ కపూర్..ప్రతిగా బాలుడికి పాదాభివందనం చేశాడు.

ఈ వీడియో చూసి నెటిజన్లు‘‘రణ్ బీర్ హంబుల్’’ గా ఉంటాడని అంటున్నారు. అభిమానికి అభివందనం చేసిన రణ్ బీర్ అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అభిమానులకే కాదు..పెద్దలు, సినీ ప్రముఖులకు రణ్ బీర్ కపూర్ గౌరవం ఇస్తాడని పేర్కొంటున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో రణ్ బీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ‘షంషేర్’ ఫిల్మ్ చేస్తు్న్నారు రణ్ బీర్ కపూర్.

Read more RELATED
Recommended to you

Latest news