స‌రిలేరు vs వైకుంఠ‌పురంలో… బ‌న్నీ ఎందుకు వెన‌క్కు త‌గ్గాడు…

టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య నెలకొన్న పోటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటేనే ట్రేడ్ వ‌ర్గాల్లో ఆందోళ‌న ఉంటుంది. అలాంటిది మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ ఇద్ద‌రి సినిమాలు సంక్రాంతి రేసులో అందులోనూ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ ఎలా ?  హీటెక్కుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి హీరోలు న‌టిస్తోన్న అల వైకుంఠ‌పురంలో, స‌రిలేరు నీకెవ్వ‌రు రెండూ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఒక గంట తేడాలోనే వీరిద్ద‌రు త‌మ సినిమాలు జ‌న‌వ‌రి 12న వ‌స్తున్న‌ట్టు పోస్ట‌ర్లు రిలీజ్ చేసుకుని మ‌రి అప్ర‌క‌టిత యుద్ధానికి తెర‌లేపారు. ప్ర‌స్తుతం కొద్ది రోజులుగా ఈ ఇద్ద‌రి సినిమాల పోటీయే ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.

ala vaikunta puram lo drops on release date
ala vaikunta puram lo drops on release date

రెండు సినిమాలు ఒకే రోజు వ‌స్తే అది ఖ‌చ్చితంగా ఇద్ద‌రి సినిమాల ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ చూప‌డంతో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌కు కూడా మైన‌స్సే అవుతుంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ పోటీ నుంచి బ‌న్నీ సినిమా త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. నిన్న రిలీజ్ చేసిన అల వైకుంఠ‌పురం పోస్ట‌ర్లో బ‌న్నీ స్టైలీష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నా రిలీజ్ డేట్ ఇందులో ముద్రించక పోవడంతో అనుమానాలు తలెత్తాయి.

బ‌న్నీ మూవీ మేక‌ర్స్ ఈ పోటీ నుంచి దాదాపు త‌ప్పుకున్న‌ట్టే తెలుస్తోంది. జ‌న‌వ‌రి 12న స‌రిలేరుకు వ‌దిలేసి 14న సోలోగా రావ‌డ‌మే బెట‌ర్ అని… అప్పుడే ఓపెనింగ్స్ కుమ్ముకోవ‌చ్చ‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త‌మ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో పాటు బిజినెస్ భారీగా జ‌ర‌గ‌డంతో మ‌హేష్ సినిమాకు పోటీగా వెళ్లి రిస్క్ చేయ‌డం కంటే రెండు రోజులు ఆగి వ‌ద్దామ‌నే డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.