కాంబో రిపీట్.. మరోసారి జంటగా రామ్ చరణ్, ఆలియా భట్!

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ఈ చిత్రం రికార్డుల వేటలో తలమునకలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పిక్చర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

 

ఇందులో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటించింది. బావ మరదలుగా రామ్ చరణ్ , ఆలియా భట్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పైన బాగా వర్కవుట్ అయింది. ఈ క్రమంలోనే వీరు మరోసారి జోడీ కట్టబోతున్నారని వార్తలొస్తున్నాయి.

రామ్ చరణ్ – ఆలియా భట్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిన నేపథ్యంలోనే వీరు మరోసారి ఓ చిత్రంలో జంటగా నటించబోతున్నట్లు సినీ వర్గాల టాక్. రామ్ చరణ్, ఆలియా భట్ లు ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, రామ్ చరణ్ మరి కొద్ది రోజుల్లోనే ‘ఆచార్య’ ప్రమోషన్స్ షురూ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీలో చరణ్ యాక్టర్ గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ రోల్ కూడా ప్లే చేశారు.

మరో వైపున ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన ‘ఆర్ సీ 15’ మూవీ చేస్తు్న్నాడు. దాని తర్వాత స్పోర్ట్స్ డ్రామాను ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తు్న్నాడు. బహుశా ఈ చిత్రంలో రామ్ చరణ్, ఆలియా భట్ జంటగా మరోసారి కనిపిస్తారా? లేదా ఆ తర్వాత చిత్రంలో కనిపిస్తారో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news