రణ్‌బీర్ లుక్స్ హాట్..‘షంషేరా’ పోస్టర్‌పై ఆలియా ఓపెన్ కామెంట్స్

-

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ ‘ప్రేమ’ కాస్త..పెళ్లి బంధంలోకి ఎంటరయ్యాయి. ఇటీవల మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ప్రస్తుతం…ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉంది. రణ్ బీర్, ఆలియా తమ సినిమాల షూటింగ్స్ కు వెళ్తున్నారు.

ఇటీవల రణ్ బీర్ కపూర్ నటిస్తున్న ‘షంషేరా’ పోస్టర్ విడుదల కాగా, అందులో రణ్ బీర్ కపూర్ లుక్ షాకింగ్ గా ఉంది. అది చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుబురు గడ్డంతో అసలు రణ్ బీరేనా? అనేది గుర్తు పట్టడం కష్టంగా ఉంది.

కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో రణ్ బీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల 22న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ పోస్టర్ పై రణ్ బీర్ కపూర్ వైఫ్ ఆలియా భట్ హాట్ కామెంట్స్ చేసింది. రణ్ బీర్ లుక్స్ హాట్ గా ఉన్నాయని, హాట్ మార్నింగ్..గుడ్ మార్నింగ్ అంటూ పోస్ట్ పెట్టింది. అది చూసి నెటిజన్లు లైక్ చేస్తున్నారు. పతిపై సతి ప్రేమ ఇలా ఉండాలని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

Read more RELATED
Recommended to you

Latest news