అల్లు అరవింద్ సంచలన నిర్ణయం..సినిమాలకు గుడ్‌ బై ?

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి సినిమాలకు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా అల్లు స్టూడియోస్ ను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు దీనికి అద్దం పట్టేలా ఉన్నాయి.

గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నానంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్‌. మా నాన్నగారు శత జయంతి ..చనిపోయి 18 ఏళ్లయిందని.. అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారని వెల్లడించారు. స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదని చెబుతూనే..గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నానంటూ పేర్కొన్నారు.