హానర్ హోమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ‘పుష్ప’..పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఈ ఫిల్మ్ కు చక్కటి ఆదరణ లభించింది. ఐకాన్ స్టార్ యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ ఫిల్మ్..రికార్డులను తిరగరాసింది.

హిందీ బెల్ట్ లో అనగా నార్త్ ఇండియాలో అయితే ప్రజలు ఈ పిక్చర్ చూసి వావ్ అనుకున్నారు. ఇది ఇలా ఉండగా.. అల్లు అర్జున్‌ తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. హానర్ హోమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ఛాన్స్‌ కొట్టేశారు. కొత్తగా రిచ్‌మాంట్‌ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది. ఏడేళ్ల కిందట హానర్‌ ప్రస్తానం ప్రారంభమైందని.. ఇది తమకు మూడో ప్రాజెక్ట్‌ ను ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. హానర్‌ ప్రచార కర్తగా నియమితులు కావడంపై బన్నీ హర్షం వ్యక్తం చేశాడు.