పొంగులేటి మా పార్టీలోకి రండి.. గెలిస్తే మీరే డిప్యూటీ సీఎం: కేఏ పాల్‌

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్​ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్​లో చేరతారా లేక బీజేపీలో చేరతారా అనే సందిగ్ధం మొదలైంది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తన నిర్ణయం చెబుతానన్న పొంగులేటి కన్నడ నాట కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత కూడా సైలెంట్​గానే ఉన్నారు. అయితే ఇటీవల బీజేపీ నేత ఈటల రాజేందర్​.. పొంగులేటిని తమ పార్టీలో చేరమని ఆహ్వానించగా ఆయన తిరస్కరించినట్లు సమాచారం.

అయితే ఈ నేపథ్యంలో పొంగులేటికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తే.. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని అన్నారు. ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని పాల్‌ ప్రారంభించారు. గెలిచిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. మరోవైపు, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని పాల్‌ డిమాండ్‌ చేశారు. అమిత్ షా తర్వాతి ప్రధాని కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news