స్టైలిష్ విలన్ వేటలో పడ్డ బన్నీ ,సుక్కు…!

-

టాలీవుడ్ టాప్ హీరోలకు కొత్త సమస్య వచ్చిపడింది.చేసే ప్రతిసినిమాలోను విలన్ విషయంలో క్యాస్టింగ్ డైరెక్టర్ కీ రోల్ పోషించాల్సి వస్తుంది.ఇప్పుడు విలన్ల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.తాజాగా బన్నీ ,సుక్కుల పుష్ప ప్రాజెక్ట్ లోను ఇదే సమస్య తలెత్తింది.ఇప్పటికి ఇద్దరు స్టైలిష్ విలన్లు ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పడంతో మరో విలన్ కోసం వేట మొదలైంది.మరి ఈసారైన సాలిడ్ విలన్ సుక్కుకు దొరుకుతాడో లేదో.?

సుకుమార్ ,అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ “పుష్ప”.ఈసినిమా గత కొన్ని రోజులుగా విలన్ సమస్యతో బాధపడుతుంది.ఎక్కడైనా హీరోయిన్స్ ఇష్యూనో లేక మ్యూజిక్ డైరెక్టర్ల డేట్స్ ఇష్యూతో సమస్య రావడం మనం విన్నాం.కాని అదేంటో విలన్ కొరత పుష్పకు పెద్ద గుదిబండలా మారింది.విజయ్ సేతుపతితో పుష్ప విలనిజం పండిపోతుందని అంతా అనుకున్నారు.కోలీవుడ్లోను మాంచి మార్కెట్ ఉన్న హీరో కావడంతో బిజినెస్ కూడా సూపర్బ్ గా జరుగుతుందనుకున్నారు.

విజయ్ సేతుపతి ఇక సెట్స్ కు రావడమే ఆలస్యం అనుకున్న టైమ్లో కాల్షీట్ల సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని … ఆ ఆఫర్ మాధవన్ చేతికి చిక్కిందని వార్తలు వచ్చాయి. మ్యాడీ ఇందులో నటిస్తే సినిమా వేరే లెవెల్ లో ఉంటుందనుకున్నారు. ఐతే తాజాగా మాధవన్ చేసిన ట్వీట్ అన్ని పుకార్లకు చెక్ పెట్టేసింది. `అబ్బాయిలూ.. ఇవేవీ నిజం కాదు` అని సింపుల్ గా ఆ వార్తలను ఖండించాడు మ్యాడీ.దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.బన్నీని డామినేట్ చేయని హీరో కోసం వెతుకులాట మొదలైంది.

పుష్పలో బన్నీ డీగ్లామరైజ్డ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇందులో చిత్తూరు మాండలికంలో బన్నీ డైలాగ్స్ ఉంటాయి.ఇప్పటికే బన్నీ ఆ యాసపై పట్టు సాధించాడు.ఇక ఫైనల్ గా ప్రకాష్ రాజ్ – జగపతి బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ రోల్ చేస్తున్నాడు.ఎర్ర దుంగల అక్రమ రవాణా ఆధారంగా రూపొందిస్తున్న ఈ విలేజ్ డ్రామా తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ – హిందీ భాషల్లో ఎట్ ఎ టైమ్ రూపొందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news