కాంతారా ఓటీటి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అమెజాన్..!!

-

ఈ మధ్యకాలంలో కన్నడ చిత్రాలు సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. మొదట కేజి ఎఫ్ సినిమా నుంచి విడుదలైన చిత్రాలలో విక్రాంత్ రొణ, చార్లీ-777, కాంతారా వంటి చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా చిన్న చిత్రంగా కన్నడ లో విడుదలైన కాంతారా సినిమా ఒక్కసారిగా సక్సెస్ను సాధించి పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఇక ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అమెజాన్ తన ట్విట్టర్ రూపంలో ఒక సమాధానాన్ని తెలియజేసింది. నేటిజన్ కాంతార సినిమా రిలీజ్ డేట్ చెప్పండి ప్లీజ్ అంటూ..అమెజాన్ కస్టమర్ సర్వీస్కు ట్విట్ చేయడం జరిగింది.. కాంతారా మూవీస్ స్ట్రీమింగ్ తేదికి సంబంధించి మీ ఆత్రుత మాకు అర్థమవుతున్నది..ఈ టైటిల్ తో ఉన్న సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది అంటూ తెలియజేసింది.

అయితే అలా ట్విట్ చేసిన కొద్దిసేపటికి ఆ ట్వీట్ అమెజాన్ డిలీట్ చేయడంతో స్ట్రీమింగ్ డేట్ మారుతుందా.. లేదంటే..అఫీషియల్ డేట్ కోసం డిలీట్ చేశారా అన్న విషయంపై ఇప్పుడు సందిగ్ధంగా ఉన్నారు ప్రేక్షకులు. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఆయన స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిం బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాదు తెలుగులో అక్టోబర్ 15న విడుదల అయింది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి అమెజాన్.

Read more RELATED
Recommended to you

Latest news