ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ లాస్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ముఖ్యంగా చీమ,ఏనుగు మీద వేసే జోక్స్ ప్రతి ఒక్కరిని నవ్వించేలా ఉంటాయి. ఇక బుల్లితెరపై తన మాటలతో ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది లాస్య. అయితే గత కొంతకాలంగా ఈమె యాంకర్ గా దూరంగా ఉన్నది. అప్పట్లో యాంకర్ రవితో కలిసి పలు కార్యక్రమాలకు ఈవెంట్లకు షోలకు యాంకర్ గా చేసి బాగానే సక్సెస్ అయ్యింది ఆ తర్వాత వివాహం చేసుకొని తన కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది లాస్య.
కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హవా ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ 4 సీజన్ లో కూడా లాస్య పాల్గొన్నది. అలా సినిమాలలో కూడా MLA, స్వాతి ఐ లవ్ యు, రాజ మీరు కేక వంటి చిత్రాలలో కూడా నటించింది లాస్య. అయితే గతంలో కూడా యాంకర్ రవితో లవ్ లో ఉన్నట్లుగా ఎక్కువగా వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్సే అన్నట్లుగా తెలియజేశారు.
అయితే ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మంజునాథ్ ను వివాహం చేసుకుంది. ఇక లాస్య తన భర్త మంజునాథ గురించి తన ప్రేమ గురించి పలు వేదికల పైన ఎన్నోసార్లు తెలియజేసింది. ఇక వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించారు.అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ప్రెగ్నెంట్ అయినట్టుగా గత కొద్ది రోజుల క్రితం తెలియజేసింది లాస్య. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే లాస్య తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియా నుంచి తను డాన్స్ చేస్తూ ఉండేటువంటి వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నేటిజన్లు సైతం ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మర్చిపోయావా లాస్య..ఏంటి ఆ డ్యాన్స్ అంటూ.. అవసరమా నికి ఈ సమయంలో అంటూ ట్రొల్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటు మరి కొంతమంది నేటిజెన్లు సలహా ఇస్తున్నారు.