యశోద సినిమాలో నటించిన మరొక నటికి మయోసిటిస్..!!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఈ వ్యాధితో బాధపడుతూ.. కనీసం నడవడానికి కూడా శక్తి లేని సమయంలో కూడా యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా హాజరు అయ్యింది. అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుటపడుతోంది అంటూ పలువురు వైద్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేయడంతో అటు సినీ ప్రముఖులు ఎంతోమంది అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి పలు ప్రయత్నాలు చేయడం జరిగింది.

మయోసిటీస్ వ్యాధి పలు రకాలుగా ఉంటుంది అని.. కొంతమందిలో చర్మానికి వస్తే.. మరి కొంతమందికి కండరాల లో తీవ్రమైన నొప్పులకు గురి చేస్తుందని తెలియజేశారు. అయితే ఈ వ్యాధి సోకిన వారు పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి తొందరగా నీరసించిపోతారని సమాచారం. అయితే సమంత ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడడంతో పూర్తిగా ఆమె చికిత్స తీసుకుంటూ త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. ఇక సమంత కూడా తన సినిమాలకు సంబంధించి ఎటువంటి వాటిలో కూడా పాల్గొనలేదు.

యశోద సినిమాలో నటించిన ఒక నటి కల్పిక గణేషన్ సైతం.. మయోసిటిస్ వ్యాధి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను కూడా మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఈమె షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత కూడా ఈ వ్యాధితో బాధపడుతూ మూడో స్టేజ్ లో ఉంది. తాను మొదటి స్టేజిలో ఉన్నానని తెలిపింది. సమంతను కలిసి ఈ విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నారని తెలియజేసింది కల్పిక. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news