‘అనుష్క శెట్టి’ 48వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అంద చందాలు మరియు నటనతో కూడా ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క.. అప్పటి నుంచి తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది.

అయితే ఇవాళ అనుష్క శెట్టి 41 వ పుట్టినరోజు. అయితే ఇటీవల ఆమె చేయనున్న కెరీర్ 48వ మూవీ గురించి ప్రకటన వచ్చింది. యువ దర్శకుడు పి.మహేష్ దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఆమె నటిస్తుండగా, నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రఖ్యాత సంస్థ యువి క్రియేషన్స్ వారు రూపొందిస్తున్న ఈ మూవీ నుండి అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు ఆమె జన్మదినం సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news