నల్గొండలో ప్రగతి పరుగు తీయాలి.. మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. వారంలోపు మునుగోడును సందర్శించి అక్కడే సమీక్ష ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధిని తానే స్వయంగా సమీక్షిస్తానని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పాత ఎమ్మెల్యేకు.. ప్రభాకర్ రెడ్డికి మధ్య పనుల్లో తేడా క్లియర్​గా కనిపించాలని చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాను తమకు కంచుకోటగా మార్చిన ప్రజలకు టీఆర్ఎస్ రుణపడి ఉంటుందని కేసీఆర్ అన్నారు. వారం రోజులలోపు పురపాలక, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు మునుగోడును సందర్శించి అక్కడే ఉమ్మడి జిల్లా సమీక్ష ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వెంటనే ఖరారు చేసి టెండర్లు పిలవాలని, నెలరోజుల్లోపే వాటిని ప్రారంభించాలని మంత్రులను ఆదేశించారు. రహదారులతో పాటు గ్రామాలు, పట్టణాలు, గిరిజన తండాల్లో సమస్యలన్నీ పరిష్కారం కావాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news