రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” లో ఐటెం సాంగ్ తో అన్వేషి జైన్

-

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోగా.. సినిమా ప్రమోషన్లు వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ రిలీజ్ చేశారు.

‘నా పేరు సీసా’…నా పేరు సీసా’. అంటూ మత్తెక్కించే పదాలతో సాగిపోతున్న ఈ ఐటం సాంగ్ ఊపు తెప్పిస్తుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట యూత్ ఆడియన్స్ కి కిక్కిస్తుంది. అయితే ఈ పాటతో ప్రముఖ స్టార్,హిందీ బిగ్ బాస్ ఫేమస్ అయిన అన్వేషి జైన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.2018లో గందీ బాత్ 2 వెబ్ సిరీస్ తో వెబ్ దునియాలోకి ఎంటరైంది అన్వేషి.ఆ తర్వాత ఓ గుజరాతి సినిమాలో నటించింది.మరి ఈ సినిమాతో తెలుగులో అన్వేషి జైన్ పాపులర్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news