యూట్యూబ్ లో ‘ అరబిక్ కుతు’ సంచలనం.. 12 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్

-

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘ బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సాంగ్. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. వారం రోజుల్లో 70 మిలియన్ వ్యూస్, 12 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దాటించింది. 3.7 మిలియన్స్ లైక్స్ దక్కించుకుంది. తమిళం అనే కాకుండా యావత్ ఇండియా విరగబడి చూస్తున్నారు.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. దీనికి తోడు యంగ్ సెన్సెషన్ అనిరుధ్ మ్యూజిక్ దుమ్మురేపింది. అనిరుధ్, జోనితా గాంధీ పాడిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కి లిరిక్స్ ని తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇచ్చారు.  సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న బీస్ట్ సినిమాకు నెల్సన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఎప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇక సినిమా విడుదలైన తర్వాత మరెన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news