ఆ విషయం తెలిసి తలలు పట్టుకుంటున్న థియేటర్ ల యజమానులు..!!

-

వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఏ దేశానికి సంబంధించిన వైద్యులు ఈ వైరస్ కి మెడిసిన్ గాని, వ్యాక్సిన్ గాని కానీ పెడతారేమో అని ఆశగా అన్ని దేశాలప్రజల ఎదురుచూస్తున్నారు. మరోపక్క దేశాల ప్రధానులు, అధ్యక్షులు తమ ప్రజలను కాపాడుకోవడానికి  లాక్ డౌన్ ఒకటే మార్గమని…ప్రకటించి ప్రజలను ఇళ్ల కి పరిమితం చేశారు. వ్యవస్థలు అన్ని స్థంబించిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఏర్పడింది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ వల్ల పరిశ్రమలు ఇంకా అన్ని రంగాలతో పాటు థియేటర్లు కూడా మూతబడ్డాయి. సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. మరోపక్క దేశంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్న పరిస్థితి బట్టి చూస్తుంటే భవిష్యత్తులో సినిమా ధియేటర్ వ్యాపారం చేసే వాళ్ళకి కాలం చెల్లి పోయే పరిస్థితి ఏర్పడింది అని టాక్ బలంగా వినబడుతుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఎక్కువ గుంపులు గుంపులు ఉండేచోట, అదేవిధంగా బాగా చల్లదనం కలిగిన వాతావరణంలో బలంగా వ్యాప్తి చెందుతుందని అందరికీ తెలుసు.

ఇటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు థియేటర్ ల యజమానులు. మరోపక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రావటంతో సినిమా ధియేటర్ వ్యవస్థ డేంజర్ జోన్ లో పడినట్లే అని ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన గాని ఈ సంవత్సరం చివరి వరకూ థియేటర్ వ్యాపారం చేసే వారికి భారీ నష్టం రావటం గ్యారెంటీ అని చాలామంది అంటున్నారు. ఒక థియేటర్లే కాదు షాపింగ్ మాల్స్ కూడా నష్టపోతాయి అని అంటున్నారు. థియేటర్ వ్యవస్థ నిలబడాలంటే కచ్చితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తేగానీ అది సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Read more RELATED
Recommended to you

Latest news