‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌పై ‘బాహుబలి’ ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే..

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీసును గడగడలాడిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి..‘బాహుబలి’ తర్వాత తీసిన ఈ సినిమా పిక్చర్ నెవర్ బిఫోర్ మూవీ అని సినీ పరిశీలకులు, క్రిటిక్స్, సినీ, రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర విజయంపైన ‘బాహుబలి’ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా..ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.

టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ ఫిల్మ్..రికార్డుల వేటలో ఇప్పటికే ‘బాహుబలి’ రికార్డులను దాటేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రీమియర్ షోలో రికార్డు వసూళ్లు చేసింది. ఈ విషయమై ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందించారు. మొత్తంగా అందరూ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కు సెల్యూట్ కొడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ పవర్ ఫుల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

ఇక ఒక్కొక్క పాత్రను జక్కన్న చెక్కిన తీరు అత్యద్భుతమని, విజ్యువల్ వండర్ గా ఈ పిక్చర్ ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుందని చెప్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాల కంటే కూడా ఈ మూవీకి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఫస్ట్ డేనే లభించిందని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాన్ ఇండియానే కాదు… పాన్ వరల్డ్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క పాత్ర చాలా బాగుందని, భావోద్వేగాల సమాహారంగా సినిమాను కథకుడు రాజమౌళి నడిపించిన తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని మెగా, నందమూరి అభిమానులు వివరిస్తున్నారు. తెలుగోడిగా మనందరం రాజమౌళిని చూసి గర్వపడాలని అంటున్నారు.