“రాధిక.. నా గాడ్ ఫాదర్” అంటున్న బాలయ్య..ప్రోమో వైరల్..!

-

బాలకృష్ణ హోస్ట్ గా మొదటిసారి చేస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆహా ఇప్పుడు రెండవ సీజన్ ను కూడా మొదలుపెట్టింది.ఇక రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ వచ్చి సందడి చేయగా , ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ కి యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరయ్యి సందడి చేశారు. ఆ తర్వాత శర్వానంద్ , అడవి శేష్ వచ్చి బాలయ్యనే ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. అలా ఆ ఎపిసోడ్ ఆద్యంతం హాస్య భరితంగా , ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో కి ఇప్పుడు.. నాల్గవ ఎపిసోడ్ లో భాగంగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అలాగే ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బాలకృష్ణ .. కిరణ్ కుమార్ రెడ్డి , సురేష్ రెడ్డిలతో రాజకీయాలకు సంబంధించిన కొన్ని విషయాలను చర్చించగా.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి బాలయ్య క్రికెట్ ఆడాడు. అందులో సడన్గా రాధిక ఎంట్రీ ఇచ్చి “అంపైర్ లేకుండా గేమ్ ఎలా ఆడతారు” అంటూ హడావిడి చేసింది. ఇక రాధికను చూడగానే బాలయ్య “వచ్చేదాకా మీరు.. నేను వచ్చిన తర్వాత ది వన్ అండ్ ఓన్లీ రాధిక” అంటూ సెటైర్ వేశారు. వెంటనే “చప్పట్లు కొడితే చంపేస్తా” అంటూ ఆడియన్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు బాలయ్య. తర్వాత రాధిక మాట్లాడుతూ.. ఏదో ఒక ప్రశ్న అడిగి.. “దానికి సరైన సమాధానం చెబితే.. ఇక బాలయ్య ఇంటికెళ్లరు. ఒకవేళ వెళ్లినా భోజనం కూడా ఉండదు” అంటూ కామెడీ చేసింది.

కొద్దిసేపటికి మళ్ళీ సోఫాలో కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టిన బాలయ్య..” చెన్నైలో ఉన్నప్పుడు రాధిక నా గాడ్ ఫాదర్” అంటూ ఆమె గురించి చాలా గొప్పగా తెలిపారు. ఇక తర్వాత “రాధిక నువ్వు.. రజనీకాంత్, కమలహాసన్, అమితాబచ్చన్, విజయకాంత్ వంటి హీరోలతో నటించావు. కానీ నాలాంటి సూపర్ స్టార్ తో నీకు అవకాశం రాలేదు” అంటూ సీరియస్ కామెడీ చేశారు. ఆద్యంతం నవ్వుల బరితంగా సాగింది ఈ ప్రోమో.. ఇక పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news