బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్‌ బై

-

బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చిన్న పాత్రలతో పరిచయమై అనతి కాలంలోనే నిర్మాతగా ఎదిగారు. అయితే.. కొంత కాలంగా నిర్మాతగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. అడపా దడపా ఆర్టిస్టుగా తెరపై కనిపిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చూస్తూ ఉంటే… ఆయన రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ తాజాగా బండ్ల గణేష్ చేశారు.

నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్ అంటూ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news