పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన బండ్ల గణేష్..!!

పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు విపరీతమైన అభిమానం.. ముఖ్యంగా తన ఆరాధ్య దేవుడిగా భావిస్తూ ఉంటాడు బండ్ల గణేష్. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి మరొక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. ఇకపోతే తన అభిమాన హీరో గురించి ఏదైనా ఈవెంట్స్ లో చెప్పాల్సి వస్తే డైలాగులతో.. స్పీచ్ ఇస్తూ ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సెట్ లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఫోటోలు , సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో రెడ్ టీ షర్టు, జీన్స్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ న్యూ స్టిల్స్ ను ట్విట్టర్లో షేర్ చేసిన బండ్ల గణేష్..” అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే.. గుండెల్లో దడ దడ మొదలైంది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే 1000 కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా ? అబ్బా ముద్దొస్తున్నావ్.. బాస్ అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని మరొకసారి పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నారు బండ్ల గణేష్ .. ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తూ ఉండగా, బాలీవుడ్ బ్యూటీ జాక్వేలిన్ ఫెర్మెండేస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో మరొక సినిమా , సముద్రఖని డైరెక్షన్ లో వినోదయ సీతం రీమేక్లో నటించబోతున్నారు. అయితే వీటిలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నెల రోజుల్లో పూర్తి కానుంది. ఇక అక్టోబర్లో దీనికోసమే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.