‘డేగల బాబ్జీ’ గా బండ్ల గణేష్.. ఫస్ట్ లుక్ వైరల్

భారీ సినిమాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెంకట చంద్రన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ…. ఎస్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

ఈ నేపథ్యం లో ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ ను ప్రముఖ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కు ”డేగల బాబ్జీ” అనే టైటిల్‌ ను ఖరారు చేసింది చిత్ర బృందం. హీరో గా పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ తో కూడా ఓ టైటిల్‌ పోస్టర్‌ ఆకట్టుకునే లా ఉంది. తమిళం లో పార్తిబన్‌ నటించిన ఒత్తు సెరుప్పు సైజ్‌ 7 కి రీమేకే ఈ డేగల బాబ్జీ. ఇక సినిమా పాత్రలపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా.. మా అధ్యక్ష ఎన్నికల్లోనూ.. బండ్ల గణేష్‌ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.