బాలయ్య వివాదంలో పెట్రోల్ పోస్తున్న బండ్ల గణేష్.!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ కు కూడా చేరుకుని లాభాల్లో ఉంది. దానితో సినిమా కోసం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇప్పడు ఎక్కడా చూసినా బాలయ్య మాటలు గురించే చర్చ నడుస్తోంది.వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య అవమాన కరంగా మాట్లాడిన మాటల పై అందరూ ఆగ్రహంగా ఉన్నారు ఇక బాలయ్య కామెంట్లకు కౌంటర్ గా.. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్. వి. రంగారావు గారు తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనమే కించపర్చుకోవడం అంటూ అక్కినేని నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇక ఇందులో మన తెలుగు కాంట్రవర్సీ మాటల కింగ్ బండ్ల గణేష్ కూడా వేలు పెట్టారు. అసలే ఏమి లేకపోయినా కూడా హడావుడి చేసే గణేష్ సంబందం లేని మేటర్ లో కామెంట్స్ చేస్తున్నాడు. తాను కూడా సోషల్ మీడియాలో వుయ్ రెస్పెక్ట్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ అండ్ చిరంజీవి సార్ అంటూ ట్వీట్ చేశాడు. దీనితో చాలా మంది నెటిజన్స్ అక్కడ చిరంజీవి టాపిక్ లేదు బండ్లన్న నువ్వెందుకు పెట్రోల్ పోస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news