ఆ న్యూస్‌ ఛానెల్ ను బహిష్కరించండి – బండ్ల గణేష్‌

-

గ్రేట్ ఆంధ్ర న్యూస్‌ ను బహిష్కరించండని టాలీవుడ్‌ దర్శకుడు బండ్ల గణేష్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ గ్రేట్ ఆంధ్ర వెంకీ గాడికి వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో మన కష్టంతో మన రక్తాన్ని చమటగా మార్చి పని చేసుకుని కళ్ళమ్మ తల్లి సేవలో ఉన్న మనందరం గ్రేట్ ఆంధ్రను బహిష్కరిద్దామని.. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దంటూ ఓ రేంజ్‌ లో ట్వీట్‌ చేశారు.

మన రివ్యూలు రాస్తే మన మీద తప్పుగా రాస్తే మన గురించి చౌకగా చీపుగా రాస్తే వాడి అంతు నేను చూస్తా. వాడు రాజకీయాల్లో ఎన్ని అయినా చేసుకోమను మనకు సంబంధం లేదు. సినిమా పరిశ్రమపై, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలపై, సినిమాని నమ్ముకుని బతుకుతున్న వాళ్లపై ఏమాత్రం రాసినా సహించేది లేదంటూ ఫైర్‌ అయ్యారు. దయచేసి గ్రేట్ ఆంధ్రను బహిష్కరించండి. ఈ పచ్చని మల్లె తోటలో ఈ గంజాయి మొక్కను పీకేద్దాం. కళామతల్లిని సంరించుకుందామని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్‌.
కళామతల్లి నీడలో బ్రతుకుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన న్యూస్ ని గ్రేట్ ఆంధ్రకిస్తే మన తల్లిదండ్రులను, ఆత్మను మోసం చేసుకున్నట్టు. ఇలాంటి గ్రేట్ ఆంద్రాన్ని మనం బహిష్కరించకపోతే మనకు మనం మోసం చేసుకున్నట్టే. నువ్వు రాజకీయంలో ఎవరినైనా తిట్టుకో.. ఎవరినైనా కొట్టుకొ మాకు సంబంధం లేదు. కానీ సినిమా వాళ్ళ జోలికి వచ్చావా? వెంకీ నీ పెంకి పగులుద్ది అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version