తెరపైకి చిరంజీవి బయోపిక్..తన వ్యాఖ్యలపై క్లారిటీనిచ్చిన సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘స్వయం కృషి’తో ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో. అంచెలంచెలుగా తన కృషి, నిజాయితీని నమ్ముకుని పైకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారందరికీ ఇన్ స్పిరేషన్ గా మెగాస్టార్ ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. తాజాగా ఆయన బయోపిక్ అంశంపై సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ చేసిన వ్యాఖ్యల విషయమై సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే బెనర్జీ సైతం చిరంజీవి బయోపిక్ పైన గతంలో చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన బెనర్జీ..ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. తాను, చిరంజీవి ఒకే వేదికపైన ఉన్న సమయంలో ఆయన అనుమతి తీసుకుని బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పానని గుర్తు చేశారు.

సినిమా రంగంలో చిరంజీవి పడిన కష్టాలు, అవమానాలు, విజయాలు, అవార్డులు, రివార్డులుతో పాటు ఆయన జర్నీ మొత్తాన్ని ఒక పిక్చర్ గా తీయగలిగితే అద్భుతంగా ఉంటుందని తాను చెప్పానని బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే, కొందరు తానే చిరంజీవి బయోపిక్ తీస్తానని అన్నట్లు వార్తలు రాస్తున్నారని, అది తప్పని స్పష్టతనిచ్చారు. చిరంజీవి గొప్ప వ్యక్తని, కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సినీ పరిశ్రమలోని 24 శాఖల వారికే కాకుండా బయటివారికి కూడా ఆయన తన వంతు సాయం చేశారని బెనర్జీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news