జోనర్ మార్చి ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. ఆ చిత్ర విశేషాలివే..!

నందమూరి నటసింహం బాలయ్య ..డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. 1990ల్లో యాక్షన్ మూవీస్ బాగా ఆడుతున్నాయి. అప్పట్లో బాలయ్య రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా హీరోగా వరుస పిక్చర్స్ చేస్తున్న క్రమంలోనే బాలయ్య..ఓ సినిమాలో ఆడియన్స్ కు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటి వరకు యాక్షన్ హీరోగా ఉన్న బాలయ్య ఆ చిత్రంతో ఫ్యామిలీ హీరో అయిపోయారు.

బాలయ్యను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేయడం కోసం తీసిన ఆ సినిమాయే ‘నారీ నారీ నడుమ మురారి’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో హీరోయిన్స్ గా శోభన, నిరోషా నటించారు. ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన మరో విశేషమేమిటంటే.. ఈ పిక్చర్ షూటింగ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే జరిగింది.

తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలో చిరంజీవికి గెస్ట్ హౌస్ ఉంది. ‘హ‌నీ హౌస్’ పేరిట ఉన్న ఆ గెస్ట్ హౌజ్ పక్కన ఉన్న రెండెకరాల స్థలం కూడా చిరంజీవిదే. కాగా, చిత్ర కథ ప్రకారం..సన్నివేశాలకు ఆ స్థలం ఉపయోగపడుతుంది. అలా ఆ పిక్చర్ షూటింగ్ చిరంజీవికి చెందిన స్థలంలోనే చేశారు.

ఇందులో బాలయ్యకు అత్తగా శారద, మరదళ్లుగా శోభన, నిరోషలు నటించారు. ఇక ఈ చిత్రంలో ‘ఇరువురు భామల కౌగిలి’ పాట ఫుల్ ఫేమస్ అయింది. ఇప్పటికీ ఈ పాట విని సినీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతుంటారు. బాలయ్య నటన ఇందులో వెరీ డిఫరెంట్ గా ఉంటుందని నందమూరి అభిమానులు చెప్తుంటారు. ఈ చిత్రానికి RRR ఫిల్మ్ స్టోరి రైటర్, రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫాదర్ శివశక్తి దత్తలు రచయితలుగా పని చేశారు. బాలయ్య ప్రస్తుతం తన 107వ పిక్చర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.