భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ..!

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న భీమ్లానాయ‌క్ చిత్రం ఈనెల 25న విడుద‌లవుతున్న విష‌యం తెలిసిందే. అయితే రేపు యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. యూసూఫ్‌గూడ బెటాలియ‌న్‌స‌మీపంలో వాహ‌నాలు భారీగా తిరుగుతుండ‌డంతో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ కింది ప్ర‌దేశాల‌కు మ‌ళ్లించ‌బ‌డుతుంద‌ని వాహ‌న‌దారులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.

  • మైత్రివ‌నం నుంచి వ‌చ్చే ట్రాఫిక్ యూసూఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమ‌తించ‌రు. స‌వేరా ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద కృష్ణ‌కాంత్ పార్కు-క‌ల్యాణ్ న‌గ‌ర్‌, స‌త్యసాయి నిగ‌మాగ‌మం, క‌మ‌లాపురి కాల‌నీ, కృష్ణాన‌గ‌ర్, జూబ్లీహిల్స్ వైపు మ‌ళ్లించ‌బడుతుంది.
  • జూబ్లీహిల్స్ నుంచి వ‌చ్చే ట్రాఫిక్ యూసూఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమ‌తించ‌బ‌డ‌దు. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ, సత్యసాయి నిగమాగమం వైపు మళ్లించబడుతుంది.
  • భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానితులు త‌మ వాహ‌నాల‌ను ఈ కింది పార్కింగ్ ప్ర‌దేశాల్లో మాత్ర‌మే పార్కు చేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు అభ్య‌ర్థించారు.

1. సవేరా ఫంక్షన్ హాల్
2. మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్
3. యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ పార్కింగ్
4. సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్
5. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం
6. ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూడ

  • ఈవెంట్‌కు హాజ‌ర‌య్యే వ్య‌క్తులంద‌రూ త‌ప్ప‌కుండా నిర్వాహ‌కులు జారీ చేసిన 23-02-2022 కొత్త పాస్‌ల‌ను క‌లిగిఉండాల‌ని.. అలాంటి పాస్ల‌లో హోలోగ్రామ్‌, సీరియ‌ల్ నెంబ‌ర్ ఉండాలి. నిర్వాహ‌కులు 21న జారీ చేసిన పాస్‌లు అనుమ‌తించ‌బ‌డ‌వు అనేది గుర్తుంచుకోగ‌లరు.
  • ముఖ్యంగా ప్ర‌జ‌లంద‌రూ పైన పేర్కొన్న వాటిని గ‌మ‌నించి వారి గ‌మ్య స్థానాల‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకుని ఆ స‌మ‌యంలో యూసూఫ్‌గూడ బెటాలియ‌న్ ర‌హ‌దారిని నివారించాల‌ని ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news