Big Boss OTT Telugu: బిగ్ బాస్..బిందు మాధవి అడ్డా..టైటిల్ ఆడపులిదే!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. హౌజ్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఇక ‘బిగ్ బాస్’..ఇంటిలో ఉన్న సభ్యుల గురించి స్పెషల్ ఏవీలు వేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఆడపులి..బిందు మాధవికి సంబంధించిన వీడియో ను వేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. సదరు ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

‘బిగ్ బాస్’ హౌజ్ లో బిందు మాధవి పర్ఫార్మెన్స్ మొదటి నుంచి టాక్ ఆఫ్ ది ఆడియన్స్ గా సాగుతోంది. ప్రతీ వారం తన ఆటను కన్సిస్టెంట్ గా కొనసాగిస్తూ స్ట్రాంగ్ కంటెండర్ గా దూసుకుపోతోంది బిందు మాధవి. ఈ క్రమంలోనే ఈమెకు ‘ఆడపులి’ అనే పేరొచ్చింది.

బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే చాన్సెస్ డెఫినెట్ గా బిందు మాధవికే ఉన్నాయని ఈ సందర్భంగా బీబీ లవర్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి సపోర్ట్ గా ప్రమోషన్స్ కొనసా..గుతున్నాయి కూడా. గత వారం హౌజ్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? టాప్ ఫైవ్ లో ఎవరు నిలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news