పుష్ప 2 నుంచి బిగ్ అప్డేట్..!

-

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ వైజాగ్ లో నిర్వహించగా అక్కడ చిత్రీకరణలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే పాల్గొన్నారు. అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు సుకుమార్ ఆ తర్వాత హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ మరియు శివారు ప్రాంతంలో చిత్రీకరణ మొదలుపెట్టారు.

ఇప్పుడు రెండవ షెడ్యూల్లో కూడా అల్లు అర్జున్ పాల్గొన్నారు.. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనడం జరిగింది. ఇకపోతే అల్లు అర్జున్ కాంబినేషన్స్ సన్నివేశాలు పూర్తి అయిన తర్వాత ఫాజిల్ పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. పుష్ప 2 సినిమాలో ఈ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ బన్వర్ సింగ్ షెకావత్ ఐపిఎస్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగంలో ఈయన పాత్రకు ఎక్కువగా స్కోప్ లేదు. కానీ అల్లు అర్జున్ కి దీటైన పాత్రలో రెండవ భాగంలో ఈయన కనిపించబోతున్నారు అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఫహద్ ఫాసిల్ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ రూపొందిస్తున్నట్లుగా మేకర్ స్పష్టం చేశారు. ఫహద్ ఫాసిల్ మాత్రమే కాకుండా సునీల్ మరియు అనసూయ పాత్రలు కూడా ఈ రెండవ భాగంలో అత్యంత కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప రెండవ భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపు సంవత్సర కాలం పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా సినిమా స్థాయిని మరింతగా పెంచడం ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news