బిగ్ బాస్ 6: 8వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్..!

-

ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఇప్పుడు ఆరవ సీజన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఆరవ సీజన్ 8 వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయం కూడా ప్రస్తుతం లీకైనట్లు సమాచారం. ఇక ఈసారి బిగ్బాస్ ఆరవ సీజన్లోకి 21 మంది కంటెస్టెంట్లు రాగా.. అందులో ఇప్పటికే 7 మంది ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఏడవ వారానికి సంబంధించి అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ షో మొత్తంలో నామినేషన్ టాస్క్ మాత్రమే చాలా ఆసక్తికరంగా సాగుతుంది…

దీనికి కారణం ఇందులో ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడమే. అందులో ఈ ఎపిసోడ్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ప్రతి సీజన్ మాదిరిగానే ఆరో సీజన్ లో కూడా నామినేషన్ టాస్కులు ఎంతో రచ్చరచ్చగా సాగుతున్నాయి. ప్రతివారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు, పోటీలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే ఈ సీజన్లో కొంతమంది మధ్య దూరం కూడా బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎనిమిదవ వారానికి సంబంధించిన నామినేషన్ టాస్క్ కూడా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలతోనే సాగింది.

తాజాగా 8వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ లో పదిమంది నామినేట్ అయ్యారు. అందులో బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్, గీతు రాయల్ , శ్రీ సత్య, రేవంత్, మెరీనా, రాజశేఖర్ , రోహిత్ , వాసంతి, కృష్ణన్ లు ఉన్నట్లు ఒక వార్త తాజాగా లీక్ అయ్యింది. ఈ పదిమంది నామినేషన్ లో ఈవారం ఫైమా, కీర్తి బట్, ఇనయ సుల్తానా , ఆర్ జె సూర్య మాత్రం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారని తెలుస్తోంది. మరి 8వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news