బిగ్ బాస్: ఎలిమినేషన్ లో ఈ ట్విస్ట్ ఏంటి..?

తెలుగులో బిగ్ బాస్ 6 మొదలయ్యి చాలా కాలం అవుతోంది. తొందరలో ఈ సీజన్ కూడా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటివరకు 83 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 6 వ సీజన్లో 12వ వారానికి సంబంధించి నామినేషన్ లో ఏడుగురు ఉన్నారు. అందులో రేవంత్ ఈ లిస్టులో లేకపోవడంతో ఇనయకు ఎక్కువగానే ఓట్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత శ్రీహాన్ , ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరి స్థానంలో మాత్రం రాజ్, ఫైమా ఉన్నట్లుగా సమాచారం. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది అయితే ఆ పాస్ యూస్ చేసిందో లేదో తెలియదు కానీ రాజశేఖర్ మాత్రం ఇప్పుడు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే గత రెండు వారాల నుంచి రాజ్ నామినేషన్ లో లేరు. ఈసారి జాబితాలలో ఉన్నారు. ఈ క్రమంలోనే మిగతా వాళ్లతో పోలిస్తే ఈ వారం అతడికి తక్కువ ఓట్లు పడినట్లుగా కనిపిస్తున్నది. దీంతో రజ్ ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది అని సమాచారం. కానీ రోహిత్ ఈవారం హౌస్ నుంచి వెళ్ళిపోతాడని మరి కొంతమంది తెలియజేశారు. కానీ చివరి నిమిషంలో రోహిత్ కు ఎక్కువ ఓట్లు పడడంతో తన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది.

బిగ్బాస్ హౌస్లో మొదట్లో చాలా సైలెంట్ గా ఉన్న రాజశేఖర్ ఆ తర్వాత తన మాటలతో అందరినీ తన వైపుకు తిప్పుకున్నారు. ఆడింది తక్కువే అయినా సరే కరెక్ట్ పాయింట్లు మాట్లాడుతూ ఉంటారు. హోస్ట్ నాగార్జున కూడా ఎన్నోసార్లు రాజశేఖర్ ను మెచ్చుకోవడం జరిగింది. గతవారం కూడా చెక్ అమౌంట్ టాస్క్ నుంచి చాలా తెలివిగా నామినేషన్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక తన తల్లి బిగ్ బాస్ హౌస్ లో చూడాలని కోరికను నెరవేర్చుకున్నారు. ఒకవేళ రాజ్ ఎలిమినేషన్ అయితే ఇలాంటి కాంట్రవర్సీలు లేకుండా హౌస్ నుంచి వీడి మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.